Webdunia - Bharat's app for daily news and videos

Install App

లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం : హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Webdunia
శనివారం, 24 జులై 2021 (14:06 IST)
ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నంకానుంది. సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఈ రెండు రోజుల పాటు ఆల‌య‌ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్ష‌లు విధించారు. 
 
ఆదివారం తెల్లవారుజామున 4 గంట‌ల‌ నుండి పూజ ముగిసే వరకు పొగాకు బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారిలో అన్ని వాహనాల రాకపోకలను నిషేధించారు. 
 
అలాగే, బాటా క్రాస్ రోడ్ నుండి ప్రారంభ‌మ‌య్యే సుభాష్ రోడ్ నుండి రామ్‌గోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వరకు హ‌వానాల రాక‌పోక‌ల‌ను  నిలిపివేశారు. అదేవిధంగా అద‌వయ్య క్రాస్ రోడ్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్ళే రహదారి, జనరల్ బజార్ నుండి ఆలయానికి వెళ్ళే రహదారిలో అన్ని వాహనాల రాకపోకలను నిషేధించారు.
 
* రైల్వే స్టేష‌న్ నుంచి ట్యాంక్‌ బండ్ వైపున‌కు తిరిగివ‌చ్చే ఆర్టీసీ బ‌స్సులు ఆల్ఫా హోట‌ల్ క్రాస్ రోడ్ గుండా గాంధీ హాస్పిట‌ల్ క్రాస్ రోడ్స్, స‌జ్జ‌న్‌లాల్ స్ట్రీట్, ఘాష్‌మండి, బైబిల్ హౌస్, క‌ర్బాలా మైదాన్ మీదుగా ప్ర‌యాణిస్తాయి.
 
* రైల్వే స్టేష‌న్ నుంచి తాడ్‌బండ్‌, బేగంపేట వైపు తిరిగివ‌చ్చే బ‌స్సుల‌ను క్లాక్ ట‌వ‌ర్, ప్యాట్నీ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ క్రాస్ రోడ్, ఎస్‌బీహెచ్ క్రాస్ రోడ్స్ మీదుగా ప్ర‌యాణిస్తాయి.
 
* ఎస్‌బీహెచ్ క్రాస్ రోడ్స్ నుండి ఆర్‌.పీ.రోడ్ వైపున‌కు వచ్చే వాహనాలను ప్యాట్నీ క్రాస్ రోడ్స్ వ‌ద్ద మ‌ళ్లింపు చేపట్టి క్లాక్ ట‌వ‌ర్‌, ప్యార‌డైజ్ వైపుగా వెళ్లాల్సివుంటుంది. 
 
* ప్యార‌డైజ్ నుండి ఆర్‌.పి.రోడ్ వైపుగా వెళ్లే వాహనాలను ప్యాట్నీ క్రాస్ రోడ్స్ వ‌ద్ద మ‌ళ్లింపు చేప‌ట్టి ఎస్‌బీహెచ్ లేదా క్లాక్ ట‌వ‌ర్ వైపు ప్రయాణిస్తాయి. 
 
* జూలై 26న మధ్యాహ్నం 2 గంట‌ల‌ నుండి 10 గంటల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సెయింట్ మేరీస్ రోడ్ వైపు ఉన్న రహదారి మూసివేస్తారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments