Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు.. కత్తితో పొడిచిన ప్రియుడు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (09:32 IST)
హైదరాబాద్ నగరంలోని రెయిన్ బజారులో దారుణం జరిగింది. ప్రేమించిన ప్రియుడుని పెళ్లి చేసుకోమని ప్రియురాలు కోరింది. అంతే.. ఒక్కసారి ఆగ్రహం చెందిన ప్రియుడు.. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నారాయణఖేడ్‌కు చెందిన రాధిక (23) తల్లిదండ్రులతో కలిసి ఆసిఫ్‌నగర్‌లో ఉంటూ  దిల్‌సుఖ్‌నగర్‌లోని మహాత్మాగాంధీ న్యాయ కాలేజీలో నాలుగో ఏడాది చదువుతోంది. అదేసమయంలో పీపుల్స్ ఫర్ యానిమల్ సొసైటీలో వలంటీరుగానూ పనిచేస్తోంది. 
 
ఈ క్రమంలో అదే సంస్థలో వలంటీరుగా పనిచేస్తున్న హైదరాబాద్, రెయిన్‌ బజార్‌కు చెందిన ముస్తఫా (19)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇదికాస్త వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ముద్దూ ముచ్చట తీర్చుకున్నారు. 
 
అయితే, గత నెల రోజులుగా ప్రియురాలు రాధికకు ముస్తఫా దూరంపెట్టసాగాడు. పైగా, తన ఫోను కూడా స్విఛాఫ్ చేశాడు. దీంతో ఏం జరిగిందో తెలుసుకుందామని శనివారం రాత్రి ముస్థాపా ఇంటికి వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నావని నిలదీసింది. 
 
అలాగే, వారిద్దరి మధ్య తెల్లవారుజామువరకు వారి మధ్య వాగ్వివాదం జరిగింది. అయినప్పటికీ రాధిక వెనక్కి తగ్గకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ముస్తఫా, తన సోదరుడు జమీల్ (23)తో కలిసి రాధికను కత్తితో పొడిచి చంపేశాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. హత్యాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ నిందితులపై హత్య కేసుతో పాటు.. మోసం, అట్రాసిటీ కేసును కూడా నమోదు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments