అతనికి మరో 8 రోజుల్లో పెళ్ళి నిశ్చయమైంది. వారం క్రితమే ఆర్భాటంగా బంధువులు నిశ్చితార్థం కూడా చేసేశారు. కానీ ఇంతలోనే కామాంధుడిగా మారిపోయాడు ఆ యువకుడు. తన ఇంటి పక్కనే ఉన్న ఒక బాలికపై అత్యాచారం చేశాడు. ఆమె నొప్పితో ఏడుస్తుంటే వారిస్తూ దొరికిపోయాడు.
బీహార్ రాష్ట్రం మధుబనిజిల్లాకు చెందిన అబ్ధుల్ ఖయ్యూం నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్ధిరపడ్డాడు. అబ్ధుల్ ఖయ్యూం బంధువులు ఇక్కడే ఉన్నారు. దీంతో ఇక్కడే వారింట్లో ఉండేవాడు. ట్యూషన్లు చెప్పుకుంటూ ఉండేవాడు. కరోనా సమయం కావడంతో ఇంటి పట్టునే ఉన్నాడు.
అయితే అతనికి పెళ్ళి నిశ్చయించారు. నిశ్చితార్థం కూడా చేసేశారు. బంధువుల అమ్మాయితోనే పెళ్ళి చేయాల్సి ఉంది. కానీ ఇంతలో అతని బుద్ధి పెడదారి పట్టింది. ఏకంగా ఇంటి పక్కన ఉన్న 11 యేళ్ళ బాలికపై అతని కన్ను పడింది. పాపను తన ఇంటికి తీసుకువచ్చి అత్యాచారం చేశాడు.
మర్మాంగాల వద్ద నొప్పితో చిన్నారి ఏడుస్తూ ఇంటికి వచ్చింది. బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించడంతో అసలు విషయం అర్థమైంది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.