Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రోలో జేబుకు స్మార్ట్ కోత... ఎలా?

హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో భాగ్యనగరి వాసులు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ఎంచక్కా స్మార్ట్‌ కార్డుల్లో స్వైప్ చేస్తూ మెట్రో జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, జులాయిలు, పో

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (09:52 IST)
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో భాగ్యనగరి వాసులు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ఎంచక్కా స్మార్ట్‌ కార్డుల్లో స్వైప్ చేస్తూ మెట్రో జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, జులాయిలు, పోకిరీలుగా తిరిగే వారికి మాత్రం హైదరాబాద్ మెట్రో అధికారులు స్మార్ట్‌గా కోత పెడుతున్నారు. ఫలితంగా వారి జేబుకు చిల్లుపడుతోంది. ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్ అనే ప్రయాణికుడికి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ ఉప్పల్ వాసి నాగోల్‌ స్టేషన్‌లో బుధవారం రూ.200 చెల్లించి స్మార్ట్‌ కార్డు కొన్నాడు. ఇందులో రూ.100 ప్రయాణం కోసం వాడుకోవచ్చు. అయితే ఇతగాడు రైలు ఎక్కకుండా… స్టేషన్‌లో గంట సేపు గడిపేశారు. తీరా బయటకు వచ్చేముందు తన స్మార్ట్‌ కార్డులోని బ్యాలన్స్‌ చెక్ చేసుకుంటే… అందులో బ్యాలెన్స్ కేవలం రూ.12 మాత్రమే ఉంది. దీంతో అతనికి అపుడు అర్థమైంది. 
 
మెట్రో స్టేషన్‌లలో పనీబాటలేని పోకిరీలు సమయం గడపడానికి వీల్లేదనీ, ఒకవేళ స్టేషన్‌లో టైమ్ స్పెండ్ చేయాలంటే డబ్బు ఖర్చు చేయాల్సిందేనన్న విషయం. రైలులో ప్రయాణించకుండా స్టేషన్‌లో ఎక్కువసేపు తచ్చాడితే ఇలాగే జరుగుతుందని మెట్రో అధికారులు చెపుతున్నారు. 
 
ముఖ్యంగా, స్మార్ట్ కార్డు ఉన్నవారు పెయిడ్‌ ఏరియాలోకి ప్రవేశించి రైలు ఎక్కకుండా ఓ గంట సేపుగడిపి మళ్లీ బయటకు వస్తే ఛార్జీలు చెల్లించాల్సిందే అంటున్నారు. ప్రవేశించిన సమయం నుంచి మొదలుకుని మళ్లీ బయటకు వచ్చే వరకు ఎంతసేపు స్టేషన్‌లో ఉంటామో.. ఆ సమయం ప్రయాణ సమయంతో సరిపోలి డబ్బులు కార్డులో ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతాయని మెట్రో అధికారులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments