Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలు బాయిలర్ కోళ్లా : ఆడపిల్లలకు హర్మోన్ ఇంజెక్షన్లా?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (11:17 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి యాదాద్రిలో సాగుతూ వచ్చిన వ్యభిచార గుట్టును ఆ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బహిర్గతం చేశారు. ఈ వ్యభిచార కూపాల్లో అనేక మంది చిన్నారులు కూడా ఉన్నారు. వీరి శరీరాలు పెరిగేందుకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి వారిని వ్యభిచారకూపంలోకి దించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిలు ఏమైనా బ్రాయిలర్ కోళ్లా అంటూ మండిపడింది. ఆడపిల్లలకు హార్మోన్ ఇంజెక్షన్స్ వేయడం ఏమిటని ప్రశ్నించింది. ఇలాంటివారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ప్రభుత్వం నిలదీసింది.
 
యాదాద్రిలో చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించుతున్నారంటూ ఇటీవల వచ్చిన కథనాన్ని సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించిన ధర్మాసనం సోమవారం విచారించింది. యాదాద్రిలో బాలికలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నా అధికార యంత్రాంగం మిన్నకుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ముఖ్యంగా, ఆడపిల్లలకు హార్మోన్‌ ఇంజక్షన్లు ఇస్తున్న వారిపై ఐపీసీ సెక్షన్‌ 120(బీ) కింద కేసులు నమోదు చేశారా? అని నిలదీసింది. బాలికలను వ్యభిచార కూపంలోకి దించకుండా తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని ఆదేశించింది. అధికారులకు తెలియకుండా ఇదంతా జరిగి ఉంటుందని తాము భావించడం లేదని, నిర్వాహకులతో సంబంధిత అధికారులు లాలూచీపడ్డట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడింది.
 
ఈ కేసులో నిందితుల బెయిలు వ్యాజ్యాలను సంబంధిత పీపీలు వ్యతిరేకించారా? అని ప్రశ్నించింది. ఈ కేసుల విచారణకు సిట్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టం చేయాలని సూచించింది. ఇటువంటి కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేలా ఆదేశాలిచ్చేందుకు కూడా తాము సిద్ధమని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments