హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే ఛాన్స్: ఎల్లో అల‌ర్ట్ జారీ

Webdunia
శనివారం, 2 జులై 2022 (19:00 IST)
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. శనివారం (జూలై 2) సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. 
 
హైద‌రాబాద్ ఉత్త‌ర భాగంలోనే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం రాత్రి హైద‌రాబాద్ న‌గ‌రవ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షం కురిసిన సంగతి తెలిసిందే.
 
జూన్‌లో‌ న‌గ‌రంలో 84.6 మి.మీ మేర వ‌ర్ష‌పాతం న‌మోదైంది. అప్పుడు సాధార‌ణ వ‌ర్ష‌పాతం 109.2 మి.మీగా నమోదైంది. రాబోయే రోజుల్లో న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు. 7.5 మి.మీ. నుంచి 15 మి.మీ. మ‌ధ్య వ‌ర్ష‌పాతం కురిసే అవ‌కాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ సిబ్బంది, జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమై తగిన చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ

బరాబర్ ప్రేమిస్తా లో మళ్లీ మళ్లీ సాంగ్ బాగుంది : జయంత్ సి పరాన్జి

న్యాయం చేసేలా ప్రయత్నిస్తా : రఘు కుంచె - దేవగుడి అలరిస్తుంది : బెల్లం రామకృష్ణ రెడ్డి

CAT మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు

అకీరా నందన్‌కు ఊరట... ఏఐ లవ్ స్టోరీపై తాత్కాలిక నిషేధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments