Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని మోదీ హైదరాబాద్‌ టూర్: భారీగా బందోబస్తు

Advertiesment
pmmodi
, శుక్రవారం, 1 జులై 2022 (20:18 IST)
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం ప్రధాని మోదీ శనివారం హైదరాబాదులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు , ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు , బీజేపీ అగ్ర నేతలు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పటు చేసింది.
 
హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జూలై 02, 03 తేదీల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. జూలై 03వ తేదీన పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
 
జులై 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే విజయ సంకల్ప సభలో పాల్గొని, ఆ తర్వాత రాజ్ భవన్ లో బస చేస్తారని తెలిపారు. ఈ క్రమంలోనే భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్: కారులో ఉన్నట్టుండి మంటలు