Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘సాలు దొర, సెలవు దొర’...‘సాలు మోదీ, సంపకు మోదీ’... హైదరాబాద్ వేదికగా టీఆర్‌ఎస్, బీజేపీ ప్రకటనల యుద్ధం

Advertiesment
Comments on Modi
, గురువారం, 30 జూన్ 2022 (17:01 IST)
హైదరాబాద్ అంతా కేసీఆర్, నరేంద్ర మోదీ ఫ్లెక్సీలతో నిండి పోయింది. జులై 2, 3న హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. జులై 2, 3వ తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ఫ్లెక్సీలతో నగరాన్ని నింపేసింది బీజేపీ. మరొకవైపు దీనికి పోటీగా తమ పనితీరుకు సంబంధించిన హోర్డింగ్‌లతో మెట్రో పిల్లర్లు, బస్‌ స్టాప్‌లను నింపేసింది తెలంగాణలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం.

 
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా మరొకసారి బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు బయటపడ్డాయి. గత కొంతకాలంగా బీజేపీతో కేసీఆర్ ఢీ కొడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు పెట్టే అవకాశం తమకు లేకుండా చేయడానికే మెట్రో పిల్లర్లు, బస్ స్టాప్స్ వంటి వాటిని తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలతో నింపేశారని బీజేపీ ఆరోపిస్తోంది.

 
దక్షిణ భారత్‌లో విస్తారించాలని చూస్తున్న బీజేపీ, తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా కాలం కిందటే కర్నాటకలో అధికారం చేపట్టినా ఇంత వరకు మరో దక్షిణ భారత రాష్ట్రంలో పాగా వేయలేక పోయింది బీజేపీ. కేసీఆర్ ఫ్లెక్సీలతో నిండిపోయిన హైదరాబాద్ మెట్రో పిల్లర్లు. హైదరాబాద్‌ మెట్రో పిల్లర్ల నిండా కేసీఆర్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో తళుక్కుమన్న అమితాబ్