Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురిపై కన్నేసి.. అన్నంలో నిద్రమాత్రలు కలిసి రేప్ చేసిన తండ్రి

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (09:23 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కన్నకూతురుపై కన్నేశాడు. 16 యేళ్ళ వయసున్న కుమార్తెను శారీరకంగా అనుభవించేందుకు కంత్రీ ప్లాన్ వేశాడు. అన్నంలో నిద్రమాత్రలు కలిపి కుమార్తెకు తినిపించాడు. దీంతో ఆ యువతి నిద్రలోకి జారుకోవడంతో ఆ కామాంధుడు తాను అనుకున్న పనిని పూర్తి చేశాడు. ఈ దారుణం హైదరాబాద్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఏడాది క్రితం నగరానికి వలస వచ్చింది. భర్త అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా.. భార్య ఇళ్లలో పనిమనిషిగా జీవితాన్ని సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె(16), కుమారుడు(14) ఉన్నారు. 
 
కరోనా వైరస్ కారణంగా బడులు లేకపోవడంతో ఆ బాలిక అమ్మానాన్నల వద్దే ఉంటోంది. అయితే, తన కుమార్తెపై కన్నేసిన కామాంధ తండ్రి... అన్నంలో నిద్ర మాత్రలు కలిపి తినిపించేవాడు. ఆమె మత్తులోకి జారిన తర్వాత లైంగిక దాడికి దిగేవాడు. నిద్రమత్తులో ఉండడంతో పాపం ఆ బాలిక ఈ ఘోరాన్ని తెలుసుకోలేకపోయింది.
 
ఈ క్రమంలో ఓ రోజు భార్య స్వగ్రామానికి వెళ్లిన సమయంలో మద్యం సేవించి వచ్చిన తండ్రి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా తల్లికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి మిన్నకుండిపోయింది. రెండు రోజుల క్రితం బాలిక అనారోగ్యంపాలై వాంతులు చేసుకుంది. దీంతో కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్ళిన తల్లిన దిగ్భ్రాంతికర వార్త తెలిసింది. 
 
ఆ యువతిని పరీక్షించిన వైద్యులు గర్భవతి అని చెప్పారు. బాలికను ఇంటికి తీసుకువచ్చిన తల్లి ఏం జరిగిందని నిలదీయగా విలపిస్తూ తండ్రి తనపై చేసిన అఘాయిత్యం గురించి చెప్పింది. గుండె రగిలిపోయిన తల్లి.. బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం