Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారిపై 22 ఇంచుల టీవీ పడింది... అంతే మృతి

Webdunia
గురువారం, 19 మే 2022 (13:21 IST)
ఆడుకుంటూ వుండిన చిన్నారిపై టీవీ పడటంతో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ ఫస్ట్‌ ల్యాన్సర్‌కు చెందిన ఎండీ లయీజుద్దీన్‌ కార్పెంటర్‌. అతడి కుమార్తె మెహ్రాజ్‌ ఫాతిమా (2) ఆడుకుంటోంది. ఆమె అల్లరి పనులను తల్లిదండ్రులు సంబరంగా చూస్తున్నారు. 
 
తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లిన ఫాతిమా టీవీ స్టాండ్‌కు తగిలింది. దీంతో దాని మీద ఉన్న 22 ఇంచుల టీవీ ఆమెపై పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో చిన్నారి స్పృహ తప్పింది. వెంటనే తల్లిదండ్రులు విజయ్‌నగర్‌కాలనీలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 
 
అనంతరం బంజారాహిల్స్‌లోని ప్రముఖ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు తలకు శస్త్ర చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments