Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2022: ముంబై ఇండియన్స్‌‌పై SRH విన్.. సజీవంగా ప్లే ఆఫ్స్ అవకాశాలు

Advertiesment
Sun risers
, బుధవారం, 18 మే 2022 (13:54 IST)
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మెరిసింది. వరుసగా 5 ఓటముల తర్వాత తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్నందుకుంది. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 3 పరుగుల తేడాతో గెలుపొందింది. 
 
అనేక మలుపులు తిరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ డేవిడ్ రనౌట్ ముంబై ఇండియన్స్ కొంపముంచగా.. భువనేశ్వర్ కుమార్ వేసిన వికెట్ విత్ మెయిడిన్ 19వ ఓవర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు విజయాన్నందించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి.
 
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి(44 బంతుల్లో 3సిక్స్‌లు, 9 ఫోర్లతో 76) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ప్రియామ్ గార్గ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), నికోలస్ పూరన్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38) ధాటిగా ఆడారు. ముంబై బౌలర్లలో రమన్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. డానియల్ సామ్స్, రిలే మెరిడిత్ తలో వికెట్ పడగొట్టారు.
 
అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీయగా.. సుందర్, భువీ చెరొక వికెట్ పడగొట్టాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంజాబ్‌ను దెబ్బకొట్టిన ఠాకూర్ - ఢిల్లీ ప్లే ఆఫ్స్ సజీవం