Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎఫ్3 నుండి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ప్రోమో వ‌చ్చేసింది

Pooja Hegde, Venkatesh, Varun Tej
, మంగళవారం, 17 మే 2022 (18:18 IST)
Pooja Hegde, Venkatesh, Varun Tej
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'ఎఫ్3' కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ. నాన్ స్టాప్ నవ్వులతో పాటు తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ రూపంలో ఎఫ్3కి అదిరిపోయే గ్లామర్ కూడా వుంది. అంతేకాదు గ్లామరస్ క్వీన్  పూజా హెగ్డే  పార్టీ సాంగ్‌లో అలరించబోతుంది.
 
 'లైఫ్ అంటే ఇట్లా వుండాలా" పాట.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది. ఈ పాట ప్రోమో ఈరోజే చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ .. పర్ఫెక్ట్ పార్టీ పోస్టర్ గా నిలిచింది. పూజా హెగ్డే, వెంకటేష్, వరుణ్ తేజ్‌ జిగేల్ అనిపించే పార్టీవేర్‌లో కనిపించారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ పిట్స్ లో స్పెషల్ పార్టీ సాంగ్ కి తగ్గట్టు మెరిశారు.  
 
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పార్టీ సాంగ్ కోసం క్యాచి, గ్రూవీ నెంబర్ ని ట్యూన్ చేసారు. ఈ పార్టీ సాంగ్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణలలో ఒకటిగా ఉండబోతుంది. ఎఫ్3 స్టార్ కాస్ట్ అంతా కనిపించేబోయే ఈ పాట ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌ కానుంది.  
 
ఈ పార్టీ సాంగ్ ని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటి నుండి.. అందరిలోనూ ఆసక్తిపెరిగింది. లిరికల్ వీడియోను విడుదల చేయడానికి ముందు పోస్టర్, ప్రోమోలను విడుదల చేస్తూ ఆ ఆసక్తిని ఇంకా పెంచింది చిత్ర యూనిట్.  
 
గతవారం విడుదలైన ఎఫ్ 3 ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. 20 మిలియన్లకు పైగా వ్యూస్ తో గత 6 రోజులుగా యూట్యూబ్‌లో ఎఫ్ 3 ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసత్య ప్రచారాలు చేయొద్దు : దర్శకుడు కొరటాల శివ