Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసి కోసం భార్య బెడ్రూం ఫోటోలు వాట్సాప్‌లో పెట్టిన నీచుడు...

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (14:29 IST)
దైవసాక్షిగా మూడుముళ్లు వేసి మనువాడిన భార్య నుంచి విడాకులు పొందడానికి, ఆమెను అగౌరవపరచడానికి ఓ నీచమైన పథకానికి పాల్పడ్డాడు ఓ భర్త. భార్యతో బెడ్రూమ్‌లో ఏకాంతంగా ఉన్న ఆమె ఆశ్లీల చిత్రాలను ప్రేయసి సహాయంతో వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టడంతో, సదరు భర్తను, అతడి ప్రియురాలని రాచకొండ సైబర్‌ పోలీసులు అరెస్టు చేశారు. 
 
రాచకొండ సిపి తెలిపిన వివరాలు ప్రకారం... ఆస్ట్రేలియాలో బిబిఎ చదివిన ఆలపాటి తులసీదాస్‌ ఉద్యోగం లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నాడు. ఫుడ్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన మోనిక విడాకులు తీసుకుని మాదాపూర్‌లో  భర్తకు దూరంగా ఉంటుంది. పని లేకుండా జులాయిగా తిరుగుతున్న తులసీదాసుకు మోనికకు ఓ ప్రైవేటు కంపెనీ మీటింగ్‌లో పరిచయం ఏర్పడింది. అది చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. 
 
ఈ విషయం తెలిసిన తులసీదాస్‌ భార్య వనస్థలిపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో తులసీదాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన భార్యపై కసి పెంచుకున్న తులసీదాస్, మోనికలు ఎలాగైనా ఆమె ప్రతిష్టకు భంగం కలిగించి, సాధ్యమైనంత తొందరాగా విడాకులు పొందేలా ప్రణాళిక రచించారు.  గతంలో భార్యతో తులసీదాస్‌  బెడ్రూమ్‌లో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సేకరించి మోనికాకు పంపాడు. 
 
మోనికి ఆ ఫొటోలను వాట్సాప్‌‌లో పలువురికి షేర్ చేయడంతో పాటు ‘డబ్బు కోసం ఏమైనా చేస్తుంది... భర్తను జైలుకు కూడా పంపించిందం’టూ మౌనిక తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టింది. దీంతో తులసీ దాస్ భార్య రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. భర్త తన బెడ్రూమ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో కన్నీరుమున్నీరుగా విలపించడంతో తులసీదాస్ భార్యను ఓదార్చారు మహిళా పోలీస్ సిబ్బంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments