Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విడాకుల కోసం వాట్సాప్‌లో భార్య అశ్లీల ఫోటోలు.. భర్త ఘనకార్యం

Advertiesment
విడాకుల కోసం వాట్సాప్‌లో భార్య అశ్లీల ఫోటోలు.. భర్త ఘనకార్యం
, గురువారం, 1 నవంబరు 2018 (09:45 IST)
కట్టుకున్న భార్య నుంచి విడాకులు పొందేందుకు ఓ భర్త.. తన ప్రియురాలితో కలిసి కట్టుకున్న భార్య అశ్లీల ఫోటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టాడు. దీంతో అతనితో పాటు అతని ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాచకొండ పోలీసు కమిషనర్ వెల్లడించిన వివరాల మేరకు... హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ఆలపాటి తులసీదాస్‌ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో బీబీఏ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈయనకు వివాహమైంది. అలాగే, ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఫుడ్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన మోనిక అనే మహిళ కూడా మనస్పర్థల వల్ల భర్త ఈశ్వర్‌ నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా నివశిస్తోంది. ఈమె హైటెక్‌ సిటీలో మేనేజర్‌గా పనిచేస్తోంది. 
 
అయితే 2017లో బంజారాహిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తులసీదాస్‌తో మోనికకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమ.. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన తులసీదాస్‌ భార్య వనస్థలిపురం పోలీసు స్టేషన్‌లో మే నెలలో ఫిర్యాదు చేసింది. దీంతో తులసీదాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ విషయాన్ని జీర్ణించుకోలేని తులసీదాస్, మోనికలు కలిసి ఆమె ప్రతిష్టను దిగజార్చి, తొందరాగా విడాకులు ఇచ్చేలా ప్రణాళిక రచించారు. ఇందులోభాగంగా గతంలో భార్యతో తులసీదాస్‌ సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి మోనికాకు పంపాడు. మోనికి ఆ ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టింది. అంతటితో ఆగకుండా అభ్యంతరక వ్యాఖ్యలను మెసేజ్‌ చేశారు. ఈ విషయమై బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో మాదాపూర్‌లో నిందితులను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న అన్నను కడతేర్చిన తమ్ముడు...