Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లల కోసమే అతడితో అక్రమ సంబంధం : టెక్కీ భార్య

Advertiesment
Hyderabad
, బుధవారం, 31 అక్టోబరు 2018 (12:34 IST)
హైదరాబాద్‌లో జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో టెక్కీ అయిన మృతుని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, తమకు వివాహమై పిల్లలు లేకపోవడంతోనే పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు ఆమె వెల్లడించింది. 
 
కాగా, హైదరాబాద్, శ్రీనగర్‌ కాలనీ, పద్మజా మాన్షన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లు ప్రశాంత్‌, పావని నివసిస్తున్నారు. వారికి పిల్లలు లేరు. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కలహాలు ప్రారంభమయ్యాయి. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త గుర్తించాడు. 
 
భార్యను పలుమార్లు హెచ్చరించినా ఆమె ఖాతరు చేయకపోగా.. నీవు చచ్చిపో అనడంతో మనస్తాపం చెందాడు. ఈనెల 28న ప్రశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతుడి తండ్రి లక్ష్మీనర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అలాగే, ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. 
 
ఈ ఆత్మహత్య కేసులో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా తిరునగరికి చెందిన ప్రశాంత్ (34) అనే వ్యక్తి వరంగల్‌కు చెందిన పావని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. దీంతో హైదరాబాద్‌, శ్రీనగర్‌ కాలనీలోని పద్మజ మ్యాన్షన్‌లో నివాసం ఉంటూ ఎవరి కార్యాలయానికి వారు వెళ్లి వచ్చేవారు. 
 
అయితే, వివాహమై సంవత్సరాలు గడిచిపోతున్నా పిల్లలు కలగలేదు. అదేసమయంలో పావనికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ప్రశాంత్‌కు తెలిసి పలుమార్లు మందలించాడు. అయినా పావనిలో ఎలాంటి మార్పురాలేదు. పైగా, భర్తనే తిట్టేది. నీవు మగాడివి కాదు.. చచ్చిపో అంటూ వేధించింది. దీంతో ప్రశాంత మానసిక వేదనకు లోనయ్యాడు. 
 
ఈ క్రమంలో బావ సలహా మేరకు భార్యను ప్రశాంత్ బెంగుళూరుకు పంపించాడు. అయినప్పటికీ ఆమె మరో వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉండటాన్ని ప్రశాంత్ జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా, తనను భార్య ఏ విధంగా తిట్టిందో సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. ఈ సూసైడ్‌ నోట్‌ను పంజాగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి లక్ష్మీనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య పనికి వెళ్లగానే కుమార్తెపై అత్యాచారం... కన్నతండ్రి అఘాయిత్యం