తెలంగాణలో ఉచితంగా హోం ఐసొలేషన్‌ కిట్లు

Webdunia
సోమవారం, 13 జులై 2020 (17:35 IST)
కొవిడ్‌ బాధితులకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తోంది. కరోనా బారినపడి ఇంట్లోనే చికిత్స పొందుతున్నవారికి సర్కారు హోం ఐసొలేషన్‌ కిట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే వీరికోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ను కూడా ప్రభుత్వం ప్రారంభించింది.

రోగికి అవసరమైన మందులు, ఇతర సామగ్రితో ఉన్న కిట్లను ఉచితంగా అందజేస్తున్నది. రాష్ట్రంలో దాదాపు 10 వేలకు పైగా బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. టెలిమెడిసిన్‌ ద్వారా సూచనలు ఇస్తున్నారు.

అత్యవసరమైనవారి కోసం త్వరితగతిన అంబులెన్సులను ఇండ్లకు పంపించి కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేర్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందిస్తున్న ఐసొలేషన్‌ కిట్లు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

రాష్ట్రంలో 85శాతం కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేనివారే ఉన్నారు. వీరు హోం ఐసొలేషన్‌లో తీసుకోవాల్సిన మందులు ఈ కిట్‌లో ఉంటాయి. దీంతోపాటు హోం ఐసొలేషన్‌‌లో ఎలా ఉండాలో సూచించే బ్రోచర్‌, కాల్‌ సెంటర్‌ నంబర్లు, వైద్యులు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల మొబైల్‌ నంబర్లను పొందుపరిచారు.
 
ఐసొలేషన్‌ కిట్‌లో ఉండే వస్తువులు:
విటమిన్‌-సీ టాబ్లెట్స్‌ 34, జింక్‌ టాబ్లెట్స్‌ 17, బీ- కాంప్లెక్స్‌ 17, క్లాత్‌ మాస్కులు 6, శానిటైజర్‌ 1, హ్యాండ్‌ వాష్ 1, గ్లోవ్స్ 2, సోడియం హైపోక్లోరైట్‌ ద్రవం 1 బాటిల్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments