Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో త్వరలో హెలీపోర్ట్​ లు

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (03:21 IST)
తెలంగాణలో కొత్తగా హెలీపోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. వీటి ద్వారా ఆలయ పర్యాటకానికి ఊతం లభిస్తుందని... దిల్లీలో జరిగిన వింగ్స్‌-2020 సన్నాహాక సమావేశంలో తెలిపారు.

కొత్త విమానాశ్రయాలు, హెలీపోర్టుల నిర్మాణానికి కేంద్రం నిధులు, అనుమతులు ఇచ్చి సహకరించాలని కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో జరిగిన వింగ్స్‌ ఇండియా-2020 సన్నాహాక సదస్సులో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. హైదరాబాద్‌ బేగంపేట వేదికగా మార్చి 12 నుంచి 15 వరకు వింగ్స్‌ ఇండియా సదస్సు జరగనుంది.

ఇందుకోసం దిల్లీలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో కేటీఆర్​ పాల్గొన్నారు. త్వరలో బేగంపేటలో ఇన్‌స్టిట్యూట్‌ వరంగల్‌, ఆదిలాబాద్, కొత్తగూడెం, జక్రాన్‌పల్లి, రామగుండం, మహబూబ్‌నగర్‌లో కొత్త విమానాశ్రయాలతోపాటు పలు ప్రాంతాల్లో హెలీపోర్టుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి వివరించారు.

హెలీపోర్టుల ద్వారా ఆలయ పర్యటక అభివృద్ది చెందుతుందన్నారు. సివిల్‌ ఏవియేషన్‌ శిక్షణ కోసం బేగంపేటలో ఈ ఏడాది ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభిస్తామని.... క్రమంగా ఏరోస్పేస్‌ యూనివర్సిటీ స్థాయికి విస్తరిస్తామని తెలిపారు. నిధులు, త్వరితగతిన అనుమతులు ఇచ్చి కేంద్రం సహకరించాలని కేటీఆర్​ కోరారు.

సంబంధిత వార్తలు

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments