Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు...

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (09:37 IST)
తెలంగాణ రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడిందని, ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిాపరు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి వైపు వాలి ఉండటంతోపాటు వచ్చే రెండు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.
 
ఈ కారణంగా రాష్ట్రంలో తూర్పు, ఉత్తర జిల్లాల్లో భారీ వర్ష సూచనలున్నాయని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుందని పేర్కొంది. 
 
ఇదిలావుంటే, బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో అత్యధికంగా 15.1 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. 
 
అదే జిల్లా కన్నేపల్లిలో 12.2, ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట 11.9, దహేగాం 11.2, భూపాలపల్లి జిల్లా పలిమెల 10.8, మహదేవపూర్ 10, ములుగు జిల్లా వాజేడు 8.8, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో 7.7 సెం.మీటర్లు కురిసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉత్తర, తూర్పు తెలంగాణలోనూ ఓ మోస్తరుగా పడ్డాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments