Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ విజయభేరీ సభ : ఆంక్షలతో సభకు అనుమతి

Advertiesment
congress flag
, గురువారం, 14 సెప్టెంబరు 2023 (09:34 IST)
హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. విజయభేరి పేరిట జరిపే ఈ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. దీంతో ఈ నెల 17వ  తేదీన తుక్కుగూడలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లుచేశారు. దీనిపై రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ స్పందించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సభ జరుపుకోవచ్చని తెలిపారు.
 
అయితే సభకు వచ్చే వారి సంఖ్య 10 వేలకు మించరాదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ సభతో సామాన్య పౌరులకు ఇబ్బంది కలగరాదని, ఆ విషయాన్ని నిర్వాహకులే చూసుకోవాలని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సీపీ పేర్కొన్నారు. రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేయరాదని తెలిపారు. ఈ మేరకు 25 షరతులతో కాంగ్రెస్ విజయభేరి సభకు అనుమతి ఇస్తున్నట్టు వివరించారు.
 
కాగా, ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తుండడంతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే, సభ నిర్వహణ కోసం పోలీసులు విధించిన ఆంక్షలు చూస్తే విచిత్రంగా ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ .. ఒక మూర్ఖుడు - మానసిక రోగి : మండిపడిన రేణుకా చౌదరి