Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓ యువతి విషయంలో రెండు వర్గాల గొడవ... వివాదంలో సవాంగ్ కుమారుడు

Advertiesment
gautam sawang
, గురువారం, 14 సెప్టెంబరు 2023 (10:49 IST)
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్‌ 10లో ఓ పబ్‌ ఎదుట బుధవారం రాత్రి ఓ యువతి విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒక యువతి కోసం ఇరు వర్గాలకు చెందిన సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఓ వర్గంలో సిద్ధార్థ మాగ్నమ్ ఉండగా.. మరో వర్గంలో ఏపీ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కుమారుడు డేవిడ్‌ సవాంగ్‌ ఉన్నట్లు సమాచారం. 
 
ఈ రెండు గ్రూపుల సభ్యుల మధ్య పబ్‌లో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. కాసేపటి తర్వాత బయటకు వచ్చి మద్యం మత్తులో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో సిద్ధార్థ, డేవిడ్‌కు గాయాలయ్యాయి. దాడుల గురించి సమాచారం అందడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెంగీ దోమలు నిర్మూలించే వోల్బాకియా బ్యాక్టీరియా