Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డెంగీ దోమలు నిర్మూలించే వోల్బాకియా బ్యాక్టీరియా

Dengue
, గురువారం, 14 సెప్టెంబరు 2023 (09:57 IST)
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డెంగీ దోమలు పెరిగిపోతున్నాయి. ఈ దోమలు కుట్టడం వల్ల అనేక డెంగీ జ్వరం బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో దోమలకు చెక్ పెట్టేందుకు వీలుగా హోండూరస్ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. ఈ దిశగా వోల్బాకియా అనే బ్యాక్టీరియాను కలిగి ఉండే దోమలను వినియోగిస్తున్నారు. 
 
దోమల్లో ఉండే డెంగీ, జీకా, చికున్ గున్యా వైరస్లతో వోల్బాకియా బాక్టీరియా వనరుల కోసం పోటీపడుతుందని, ఫలితంగా దోమల్లో ఈ వైరస్‌లు పునరుత్పత్తి బాగా తగ్గిపోతుందని చెబుతున్నారు. ఈ దోమలు తమ సంతానానికీ ఈ బ్యాక్టీరియాను బదిలీ చేస్తాయని, ఫలితంగా వ్యాధుల వ్యాప్తిని నిరోధించడం మరింత సులభమవుతుందని చెప్పారు.
 
దశాబ్దకాలంగా అనేక దేశాల్లో అమలవుతున్న ఈ వ్యూహాన్ని హోండురాస్ అధికారులు తాజాగా అనుసరించడం ప్రారంభించారు. రాజధాని తెగెసి అల్పాలో వోల్బాకియా దోమలను పెద్ద సంఖ్యలో విడుదల చేస్తున్నారు. వచ్చే ఆరు నెలల్లో మొత్తం 90 లక్షల వోల్బాకియా దోమల్ని విడిచిపెడతామని వారు చెప్పారు. అయితే, ఈ వ్యూహాం అమలుకు ఖర్చు భారీగా ఉంటుందని కూడా చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ విజయభేరీ సభ : ఆంక్షలతో సభకు అనుమతి