Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సనాతన ధర్మం కరోనా వైరస్ వంటిది.. నిర్మూలించాలని: మంత్రి ఉదయనిధి స్టాలిన్

Advertiesment
udayanidhi stalin
, ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (16:45 IST)
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సనాతన ధర్మం కరోనా, దోమ వంటిదని సామాజిక రుగ్మతలకు కారణమవుతోందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమవుతున్నాయి. 
 
ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉదయనిధి మాట్లాడుతూ, సనాతన ధర్మం దోమ లాంటిదని, సామాజిక రుగ్మతలకు కారణమతోందని ఆరోపించారు. సామాజిక న్యాయానికి పూర్తిగా వ్యతిరేకమైన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలను నరమేథంతో పోల్చారు. బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వీయ మాట్లాడుతూ, భారత్‌లో 80 శాతం జనాభా నరమేథానికి ఉదయనిధి పిలుపునిచ్చారంటూ మండిపడ్డారు. 
 
'రాహుల్ గాంధీ తరచూ "ప్రేమ దుకాణం" గురించి మాట్లాడతారు కానీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన డీఎంకే వారసుడు మాత్రం నరమేథానికి పిలుపునిచ్చారు. ఇండియా కూటమి తన పేరుకు తగట్టు అవకాశం వస్తే యుగాల నాటి 'భారత్' అనే సంస్కృతిని సర్వనాశనం చేస్తుంది" అంటూ ట్వీట్ చేశఆరు. 
 
మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఉదయనిధిపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఆయనను అరెస్టు చేసి కేసు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తనపై వస్తున్న విమర్శలపై కూడా మంత్రి ఉదయనిధి ధీటుగా స్పందించారు. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై ఏమాత్రం వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. పైగా, తాను నరమేథం గురించి మాట్లాడలేదన్నారు. అలాగే, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
 
'సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పాలైన బడుగు, అణగారిన వర్గాల తరుపున నేను మాట్లాడా. పెరియార్, అంబేద్కర్ వంటి వారు ఈ అంశంపై లోతైన పరిశోధనలతో పలు రచనలు చేశారు. సమాజంపై సనాతన ధర్మం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించిందో చెప్పారు. అవన్నీ ఊటంకించేందుకు ఉన్నా “నా ప్రసంగంలోకి కీలక భాగాన్ని ఇక్కడ మరోసారి ప్రస్తావిస్తున్నా. 
 
దోమల కారణంగా కొవిడ్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో అదేవిధంగా సనాతన ధర్మం సామాజిక రుగ్మతలకు దారి తీసింది. న్యాయస్థానంలోనైనా.. ప్రజాకోర్టులో అయినా సరే.. ఎటువంటి సవాలుకైనా సరే సిద్ధంగా ఉన్నా. తప్పుడు వార్తల వ్యాప్తిని మానుకోండి'' అంటూ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?