Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పుల బాధ కేరళలో ఘోరం.. ఇద్దరు కుమారుల్ని చంపి.. దంపతుల ఆత్మహత్య

Advertiesment
Couple
, బుధవారం, 13 సెప్టెంబరు 2023 (10:11 IST)
Couple
కేరళలో ఘోరం జరిగింది. తన ఇద్దరు కుమారులను చంపి.. దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కేరళలోని ఎర్నాకులం జిల్లా కడమకుడి ప్రాంతానికి చెందిన నిజో (వయస్సు 39) భవన నిర్మాణ కార్మికుడు. ఇతని భార్య శిల్పా (29). వీరికి ఐబాన్ (7), ఆరోన్ (5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు మేడమీద నివసించారు. నిజో తమ్ముడి కుటుంబం, గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసించారు. 
 
ఈ నేపథ్యంలో నిజో కుటుంబీకులు రాత్రి నిద్రపోయారు. మంగళారం తెల్లవారుజాము వరకు బయటకు రాలేదు. దాంతో నిజో తల్లి వారి ఇంటికి వెళ్లింది. ఎంత తలుపు తట్టినా నిజో గది తెరవలేదు. అనుమానంతో కిటికీలోంచి చూడగా బెడ్‌రూమ్‌లో నిజో, శిల్పా ఉరివేసుకుని కనిపించారు. మనవళ్లిద్దరూ మంచంపై శవమై కనిపించారు. ఇది చూసి అందరూ షాకయ్యాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. తలుపులు పగులగొట్టి లోపలికెళ్లారు నిజో, శిల్ప సహా నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పరవూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో నిజో భార్య శిల్ప పని నిమిత్తం ఇటలీ వెళ్లింది. అక్కడ సరైన ఉద్యోగం, జీతం రాకపోవడంతో ఇటీవల కేరళకు తిరిగొచ్చింది. దీంతో అప్పుల బాధ పెరిగింది. దీంతో నిజో, శిల్ప ఇద్దరు కుమారులకు విషమిచ్చారు. 
 
ఆపై దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రేక్‌డౌన్ అయి ఆగివున్న బస్సును ఢీకొన్న ట్రక్కు... 11 మంది మృతి