చిత్తూరులో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు జనవాసానికి రావడంతో ప్రజలు పరుగులు తీశారు. అయితే ఏనుగు తొక్కడంతో చిత్తూరు జిల్లాకు చెందిన భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు.
గుడిపాల మండలం రామాపురం హరిజనవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామాపురంలో పొలంలో పనిచేస్తున్న దంపతులపై దాడి చేయడంతో.. వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఏనుగుల గుంపు నుంచి విడిపోయి గ్రామ సమీపంలోని పొలాలపై పడింది. రామాపురంలో పొలంలో పనిచేస్తున్న వెంకటేశ్, సెల్వి దంపతులపై ఏనుగు దాడి చేయడంతో.. వారు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆ తర్వాత సీకే పల్లెలో మామిడి తోటలో కార్తీక్ అనే యువకుడిపై ఏనుగు దాడి చేయగా.. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. కార్తీక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఇంకా ఏనుగును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.