Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్రమ సంబంధం పెట్టుకున్నారనీ.. పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి..

Advertiesment
beaten
, శుక్రవారం, 25 ఆగస్టు 2023 (09:11 IST)
త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలాకు సమీపంలోని బెలోనియా అనే పట్టణంలో ఓ ఘటన జరిగింది. ఓ జంట అక్రమ సంబంధం పెట్టుకుంది. దీన్ని తప్పుబట్టిన స్థానికులు ఆ జంటను పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి చావ బాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఒక వ్యక్తికి పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బంధువుల ఇంట్లో ఉంటున్న 20 యేళ్ల యువతికి, ఈయనకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో శనివారం వారిద్దరూ కలిసి ఉండగా మహిళ బంధువులు ఆ జంటను పట్టుకున్నారు. 
 
అనంతరం వారిని విద్యుత్ స్తంభానికి తాళ్లతో కట్టేశారు. అంతా చూస్తుండగా వారిద్దరిని కొట్టారు. ఆ ప్రాంతంలోని స్థానికులు వారిని కాపాడేందుకు ముందుకు రాలేదు. అయితే, వారిపై దాడి చేస్తున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
దీంతో ఈ వీడియో ఇపుడు వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. అయితే తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఆ వ్యక్తి లేదా మహిళ ముందుకు రాలేదు. దీంతో పోలీసులే ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రయాన్ -3 ప్రయోగం : 14 రోజుల తర్వాత ల్యాండర్ ఏమౌతుంది?