Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్లమెంట్‌లోనే తోటి సభ్యుడు లైంగికదాడికి పాల్పడ్డాడు..

woman victim
, గురువారం, 15 జూన్ 2023 (14:27 IST)
ఆస్ట్రేలియా దేశ పార్లమెంట్‌ వేదికగా ఓ చట్ట సభ్యురాలికి ఘోర అవమానం జరిగింది. తనపై తోటి సభ్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే ఈ పార్లమెంట్‌ భవనం మహిళలు విధులు నిర్వర్తించడానికి సురక్షితంగా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సెనేట్‌ సభలో ఆమె ఉద్విగ్నభరిత ప్రసంగం చేశారు.
 
పార్లమెంట్‌లో ఓ శక్తిమంతమైన వ్యక్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ స్వతంత్ర మహిళా సెనేటర్‌ ఆరోపించారు. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన సెనేటర్‌ డేవిడ్‌ వాన్‌ తనతో దారుణంగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. గురువారం సెనేట్‌లో ప్రసంగిస్తూ తనపై జరిగిన వేధింపులను వివరించారు. 
 
'నన్ను ఆయన అనుసరించేవారు. అభ్యంతరకరంగా తాకేవారు. శృంగార కార్యకలాపాల కోసం ప్రతిపాదనలు చేసేవారు. దీంతో ఆఫీసు గదిలో నుంచి బయటకు రావాలంటేనే భయపడేదాన్ని. డోర్‌ కొంచెం తెరిచి బయట ఆయన లేరని నిర్ధారించుకున్న తర్వాతే వచ్చేదాన్ని. పార్లమెంట్ ప్రాంగణంలో నడవాల్సి వచ్చినప్పుడు తోడుగా ఎవరో ఒకరు ఉండేలా చూసుకున్నా. నాలాగే ఇంకొందరు కూడా ఇలాంటి వేధింపులు అనుభవిస్తున్నారని తెలుసు. 
 
కానీ, కెరీర్‌ పోతుందని భయపడి వారు బయటకు రావట్లేదు. ఈ భవనం మహిళలకు సురక్షిత ప్రదేశం కాదు' అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. పార్లమెంట్ నిబంధనలకు అనుగుణంగా దీనిపై తాను కేసు పెట్టనున్నట్లు తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను డేవిన్‌ వాన్‌ తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. దీనిపై తాను న్యాయపరంగా పోరాడుతానని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో స్కూటీపై పెళ్లి కుమార్తె రీల్స్ - రూ.6 వేలతో అపరాధంతో పోలీసుల చదివింపులు