Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీడియో గేమ్‌‌ల కోసం రూ.52 లక్షలు పోగొట్టుకున్న బాలిక

వీడియో గేమ్‌‌ల కోసం రూ.52 లక్షలు పోగొట్టుకున్న బాలిక
, బుధవారం, 14 జూన్ 2023 (20:14 IST)
వీడియో గేమ్‌లపై మక్కువతో ఓ బాలిక రూ.52 లక్షలు పోగొట్టుకున్న ఘటన చైనాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం చిన్నారులు, యువతలో గేమింగ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పలువురు చిన్నారులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
 
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ బాలిక మొబైల్ గేమ్‌లు ఆడటంపై మోజు పెంచుకుంది. కొత్త గేమ్‌లు, గేమ్‌లోని గాడ్జెట్‌లను కొనుగోలు చేయడానికి ఆ అమ్మాయి తన తల్లి డెబిట్ కార్డ్‌ని దొంగతనంగా ఉపయోగిస్తోంది. 
 
ఒకరోజు బాలిక తల్లి తన బ్యాంకు ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయగా అందులో కేవలం 5 చైనీస్ యువాన్లు మాత్రమే కనిపించాయి. బ్యాంకు ఖాతాలో 1,20,000 చైనీస్ యువాన్ ఉంది. దీంతో ఆమె షాక్ అయ్యింది. 
 
ఈ విషయమై బాలికను ప్రశ్నించగా.. ఆ డబ్బులన్నీ గేమ్స్‌ కొనుక్కోవడానికి ఖర్చు చేసినట్లు తేలింది. తన స్కూల్ ఫ్రెండ్స్‌తో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేందుకు కూడా ఆ బాలిక డబ్బు ఖర్చు చేసింది. గేమ్ ఆడేందుకు భారతీయ కరెన్సీలో 52 లక్షలు ఖాళీ చేసిన బాలిక ఘటన సంచలనం రేపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు