Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నైజీరియాలో విషాదం.. పడవ మునిగి 100 మంది జలసమాధి

boat accident
, బుధవారం, 14 జూన్ 2023 (07:46 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన నైజీరీలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ పడవ మునిగిన ఘటనలో వంద మంది వరకు మృత్యువాతపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున నైజర్ నదిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రాణాలతో ఉన్నవారి కోసం సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. పొరుగున్న ఉన్న నైజర్ రాష్ట్రానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు క్వారా రాష్ట్ర పోలీస్ విభాగం ప్రతినిధి ఒకాసల్మి వెల్లడించారు. 
 
నదిలోని అలల ఉధృతికి పడవ కుదుపులకు లోనైంది. ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొన్నట్టుగా భావిస్తున్నారు. ఈ బోట్‌లో ప్రయాణిస్తున్న వారు అందరూ కూడా నైజర్ రాష్ట్రంలోని ఎగ్బోటి గ్రామంలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారని చెబుతున్నారు. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మునిగిన పడవలో దాదాపు వంద మంది వరకు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. 
 
తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగిందని, దీంతో చాలా మంది నీటిలోనే జలసమాధి అయివుంటారని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదం వేకువజామున జరగడంతో బాహ్య ప్రపంచానికి ఆలస్యంగా తెలిసింది. దీంతో ప్రాణనష్టం అధికంగా ఉందని. జలసమాధి అయిన ప్రయాణకుల మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
మొసలిని కొట్టి చంపేసిన గ్రామస్థులు
బీహార్ రాష్ట్రంలో ఇటీవల ఓ మొసలి పదేళ్ల బాలుడిని చంపేసి భక్షించింది. ఆ తర్వాత నదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆ మొసలిని అంతమొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతే.. నదిలోని మొసలిని బయటకు లాగి కొట్టి చంపేశారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా, రాఘోపూర్ దియారా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దియారా గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల కొత్త బైక్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ వాహన పూజకు కావాల్సిన పవిత్ర జలం కోసం అమిత్ కుమార్ అనే బాలుడు గంగానదిలోకి దిగాడు. 
 
అమిత్ నదిలో స్నానం చేస్తుండగా, మొసలి దాడి చేసి, అతడిని కుటుంబ సభ్యుల ముందే తిలేసింది. దీంతో కటుుంబ సభ్యులు గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ తర్వాత గ్రామస్థులంతా కలిసి బాలుడుని చంపిన మొసలి పట్టుకుని నదిలో నుంచి బయటకులాగి ఇనుపరాడ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదేళ్ల బాలుడిని తినేసిన మొసలి... కొట్టి చంపేసిన గ్రామస్థులు