Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా కానిస్టేబుల్‌పై బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ అత్యాచారం

Advertiesment
woman victim
, బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (17:54 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. భారత సరిహద్దు దళం(బీఎస్ఎఫ్)లో పనిచేసే ఒక మహిళా కానిస్టేబుల్‌పై ఇదే విభాగంలో పని చేసే ఇన్‌స్పెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, బీఎస్ఎస్ ఉన్నతాధికారులు కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నదియా జిల్లా ఔట్‌పోస్ట్‌లో తుంగి సరిహద్దు వద్ద ఉండే ఔట్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించే ఇన్‌స్పెక్టర్ ఈ నెల 19వ తేదీన బీఎస్ఎఫ్ విభాగంలో మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ స్పందించడంతో వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకుని బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఇన్‌స్పెక్టరుపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు చేసినట్టు తెలిపారు. అయితే శాఖాపరమైన విచారణ జరుగుతున్నందున దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు బీఎస్ఎఫ్ అధికారులు నిరాకరించారు. అయితే, ఇన్‌స్పెక్టరుపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం శిక్షిస్తామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టార్టపీడియా 23 వద్ద ఆర్ధిక మందగమన వేళ తీసుకోవాల్సిన చర్యలు: స్పాట్‌ఫ్లోక్‌ సీఈఓ శ్రీధర్‌ శేషాద్రి అభిప్రాయాలు