Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి జరిగిన మూడు నెలలకే ఇలా జరగాలా?

Advertiesment
పెళ్లి జరిగిన మూడు నెలలకే ఇలా జరగాలా?
, శనివారం, 19 ఆగస్టు 2023 (14:29 IST)
పెళ్లి జరిగిన మూడు నెలలకే ఆ జంట ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద దుర్గటన మరిపెడ మండలం తానంచర్ల శివారులో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన గుగునాద్ గోపి - సునీతల కుమార్తె అంజలిని భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తెల్లగరిగా గ్రామానికి చెందిన తుంగర నారాయణకి ఇచ్చి 09-03-2023న వివాహం జరిపించారు. నారాయణ హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో అంజలి బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు వస్తున్న క్రమంలో శనివారం మరిపెడ మండలం తానంచర్ల గ్రామ శివారు కోరుకొండ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విరిద్దరూ మరణించారు. 
 
సరిగ్గా మూడు నెలల్లోనే విరి జీవితం ముగిసిపోయింది. మూడు నెలలకే మీ ముక్కుపచ్చని కాపురం ముగిసిందా బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగువలకు గుడ్ న్యూస్- తగ్గిన బంగారం, వెండి ధరలు