Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం.. ఈ నెల 16 వరకు ఇదే పరిస్థితి...

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (09:21 IST)
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీగా ఈదురు గాలులు వీయడంతో అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల 16వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
నగరంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, అల్వాల్, బోయిన్ పల్లి, మణికొండ, టోలీచౌకి, అత్తాపూర్, రాజేంద్ర నగర్, సికింద్రాబాద్, మాదాపూర్‌లో వర్షం కురుస్తుంది. ఈదురు గాలులు ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. 
 
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ సిబ్బంది రోడ్లపై నీళ్లు నిలువకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్నాళ్లుగా ఎండతో పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో వాతావరణం కాస్త చల్లబడే అవకాశం ఉంది. ఈ వర్షాలు హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments