తెలంగాణాలో జూన్ 6న గురుకుల కాలేజీల ప్రవేశ పరీక్ష

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (13:25 IST)
ఈ నెల ఆరో తేదీన గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణా గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణ  కుమార్ తెలిపారు. 
 
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ యేడాది ఈ నెల 6వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 
 
ఈ పరీక్ష కోసం హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుంది. 
 
గురుకుల వెబ్ సైట్ నుంచి ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, హాల్ టిక్కెట్లలో ఏవేని తప్పులు దొర్లినా, అక్షర దోషాలు ఉన్నా పరీక్షా కేంద్రం వద్దకు తగిన ఆధారాలతో వెళ్లి సరిచేసుకోవచ్చని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments