Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-06-2022 గురువారం రాశిఫలాలు - లక్ష్మి కుబేరుడిని ఆరాధించిన...

Advertiesment
astro4
, గురువారం, 2 జూన్ 2022 (04:00 IST)
మేషం :- వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఇతరులకు మేలు చేసినా విమర్శలు తప్పవు. మీ శ్రమకు లభించిన ప్రతిఫలంతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. రాజీ మార్గంతో సమస్యలు పరిష్కరించుకోవాలి.
 
వృషభం :- బంధు మిత్రుల వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. ఉమ్మడి, ఆర్థిక వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం మంచిది. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
మిథునం :- సంతానంపై చదువులపై శ్రద్ధ వహిస్తారు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు క్షేమం కాదని గమనించడి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు శుభదాయకం. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఏ విషయాన్ని తేలికగా కొట్టివేయద్దు.
 
కర్కాటకం :- బంగారం, వెండి, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల అత్యుత్సాహం వల్ల ఊహించని చికాకు లెదుర్కోవలసి వస్తుంది. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించగలరు.
 
సింహం :- యాదృచ్ఛికంగా తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. బ్యాంకు వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. కొనుగోళ్ళ విషయంలో ఏరాగ్రత వహించండి. అధికారులకు తనిఖీలు, పర్యటనలతో తీరిక ఉండదు. ఉద్యోగస్తులకు ఒక అవకాశం చేతిదాకా వచ్చివెనక్కిపోయే ఆస్కారం ఉంది. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆశాజనకం.
 
కన్య :- ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లకు ఏకాగ్రత చాలా అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు.
 
తుల :- పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు అధికం, చేతిలో ధనం నిలవటం కష్టమే. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పత్రిక, వార్తా మీడియా వారికి ఊహించని సమస్యలెదురవుతాయి.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తి పై జీవించాలన్న పట్టుదల అధికమవుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించకపోవటం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు.
 
ధనస్సు :- బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. బంధువులు మీ స్థితిగతులను చూచి అసూయపడే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి.
 
మకరం :- కాంట్రాక్టర్లు, బిల్డర్లకు అభ్యంతరాలు, చికాకులు అధికం. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం నిరుత్సాహం కలిగిస్తుంది. ఖర్చులు అధికమైనా మీ ఆర్థిక స్థితికి ఏమాత్రం లోటుండదు. వృత్తి, ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. 
 
కుంభం :- నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. ఆధ్మాత్మిక సమావేశాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు.
 
మీనం :- కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. మీ సంతానం వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని సందర్భాల్లో మీ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-06-22 బుధవారం రాశిఫలాలు ... మహావిష్ణువును పూజించిన పురోభివృద్ధి...