శాంతించిన గోదారమ్మ... 47.9 అడుగులకు చేరిన నీటిమట్టం

Webdunia
బుధవారం, 20 జులై 2022 (12:12 IST)
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉగ్రరూపం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్ట 47.9 అడుగులకుచేరుకుంది. అంటే 1139230 క్యూసెక్కులు నీటి ప్రవాహంగా ఉంది. వరద ఉధృతి నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. 
 
గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం రికార్డు స్థాయికి చేరిన విషయం తెల్సిందే. అయితే, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువున ఉన్న ప్రాజెక్టులు గేట్లు మూసివేశారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో వరద క్రమంగా తగ్గుతూ వస్తుంది. 
 
మరోవైపు, ఎగువ జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టుకు లక్షా ఆరు వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. 16 గేట్ల ద్వారా లక్షా 58 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.60 టీఎంసీల నీరు నిల్వవుంది. 
 
అదేవిధంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చిచేరుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా క్రమంగా నిండుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,52,967 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 19040 నీరు దిగువనకు వెళుతున్నది. 
 
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇపుడు 876 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 168.2670 టీఎంసీల నీరు ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments