Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాత్రూంలోకి వెళ్లి బయటకు రాలేదు... తలుపు తీస్తే పడిపోయి వుంది..

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (19:40 IST)
అప్పటిదాకా తోటి విద్యార్థులతో కలిసి మెలసి ఉన్న స్నేహితురాలు పాఠశాలకు టైం అవుతుంది అని చెప్పి తొందరగా రెడి కావాలి అంటూ బాత్‌రూమ్ లోకి వెళ్లింది. ఐతే ఆ తర్వాత ఆమె ఎంతకూ బయటకు రాలేదు. దాంతో తలుపులు పగులగెట్టి చూసేసరికి స్ప్రుహ లేకుండా కింద పడి ఉన్న స్నేహితురాలిను చూసిన తోటి విద్యార్థులు వెంటనే ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. 
 
వెంటనే జనగామ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందింది విద్యార్థిని. ప్రిన్సిపాల్ విద్యార్థిని బంధువులకు సమాచారం అందించారు.విద్యార్థిని మృతికి యాజమాన్యం నిర్లక్ష్యం కారణం అంటూ వసతి గృహం ఎదుట ఆందోళన చేపట్టారు.
 
 భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో బ్యాక్ టూ బ్యాక్ క్రిస్టియన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన వసతి గృహంలో నల్గొండ జిల్లా, తిరుమలగిరి మండలం మొఖ్య తండాకు చెందిన కేతవత్ బిందు (14 సంవత్సరాలు) ఆలేరు జేఎంజె పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 
 
రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం త్వరగా పాఠశాలకు వెళ్ళాలి అని బాత్రూం లోకి వెళ్లి రాకపోవడంతో తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. తమ బిడ్డ బిందు మృతికి వసతి గృహం యాజమాన్యం నిర్లక్ష్యం కారణం అని బంధువులు వసతి గృహం ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments