వరలక్ష్మిని పెళ్లి చేసుకోవట్లేదు.. త్వరలో విశాల్ నిశ్చితార్థం

మంగళవారం, 1 జనవరి 2019 (14:06 IST)
వరలక్ష్మి-విశాల్‌లకు పెళ్లి జరుగబోతున్నట్లు వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా విశాల్ నిశ్చితార్థం జరుగనుంది. సినీ నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారట. హైదరాబాద్‌కు చెందిన అనీసా అనే ఓ వ్యాపారవేత్త కుమార్తెతో విశాల్ వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. 
 
త్వరలో హైదరాబాద్ నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నారట. పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే నడిగర్ సంఘం కోసం కొత్త భవనాన్ని నిర్మించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని శపథం చేశారు. 
 
కాబట్టి ప్రస్తుతానికి నిశ్చితార్థ పనులు మొదలుపెట్టే పనిలో ఆయన కుటుంబీకులు ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇకపోతే, వరలక్ష్మి ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. విశాల్‌ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 'వినయ విధేయ రామ' పోస్టర్.. కైరా అద్వానీకి సహాయం చేస్తూ..