తెలంగాణ రహదారులకు పచ్చదనం కళ

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (08:55 IST)
తెలంగాణలోని అన్నిజాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లు పచ్చదనంతో కళకళలాడేలా అవసరమైన రోడ్ల వెంటనే నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి ఆదేశాలను వెంటనే అమలు చేయాలని నర్సీరీల సంఖ్య నెలకొల్పే ప్రదేశాలను వెంటనే ఖరారు చేయాలని అధికారుల బృందం నిర్ణయించింది. డిఎఫ్‌ఓ, హైవేస్‌, అర్‌అండ్‌బి అధికారులు ఉమ్మడిగా ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు.

జాతీయ రహదారుల వెంట 40 నర్సరీలు, రాష్ట్రహైవేస్‌లో 69, రోడ్లు భవనాలశాఖ పరిధిలో రహదారుల వెంట 141 మొత్తం 250 నర్సరీలను ఏర్పాటు చేయనున్నారు. 
 
ఒక్కోనర్సరీలో 40 వేల చొప్పున మొత్తం కోటి పెద్ద మొక్కలు పెంచేలా, వాటిని అన్నిరోడ్లకు రహదారి వనాలు(ఎవెన్యూ ప్లాంటేషన్‌) కోసం ఉపయోగించాలని నిర్ణయించారు.

ఈ నర్సరీల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులను వాడుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. వెంటనే నర్సరీలను ప్రారంభించి వచ్చే సీజన్‌కల్లా మొక్కలు నాటేలా ప్లాన్‌ చేయాలని అధికారుల బృందం నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం

ప్రతీ చోటా రాకాస కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments