Publish Date: Fri, 26 Jun 2020 (12:09 IST)
Updated Date: Fri, 26 Jun 2020 (12:10 IST)
హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ జువాలజికల్ పార్కులో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెల్లరంగు రాయల్ బెంగాల్ టైగర్ కిరణ్ మృతిచెందింది.
ఎనిమిదేండ్ల కిరణ్ కుడి దవడ భాగంలో ఏర్పడిన నియోప్లాస్టిక్ కణితి కారణంగా అనారోగ్యం పాలైందని, గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ఇప్పుడు మరణించిందని జూ అధికారులు తెలిపారు. కిరణ్ నెహ్రూ జూలోనే పుట్టి పెరిగిందని వారు వెల్లడించారు.
గత నెల 29న పరీక్షలు చేయగా కిరణ్ కుడి దవడలో కణితి ఉన్న విషయం బయటపడిందని చెప్పారు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు, వైద్యులు పులికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
మృతి చెందిన పులికి వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కిరణ్ తండ్రి బద్రి కూడా నియో ప్లాస్టిక్ కణితితోనే బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కిరణ్ తాత రుద్ర 12 ఏండ్ల వయసులో ఇదే వ్యాధితో మృతి చెందింది.