Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రో సరికొత్త ఆఫర్.. రూ.59 చెల్లిస్తే రోజంతా ఎక్కడైనా?

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (15:58 IST)
హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తాజాగా జనం మెచ్చే సరికొత్త భారీ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.59 ధర చెల్లించి ఒక రోజులో ఎక్కడి నుంచి మరెక్కడికైనా ఎన్నిసార్లైనా తిరిగే వెసులుబాటు కల్పించింది. 
 
అయితే, ఈ ఆఫర్ అన్ని రోజుల్లో వర్తించదు. కొన్ని నిర్దేశిత సెలవు రోజుల్లో మాత్రమే వర్తించనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. నెలలో ప్రతి ఆదివారం, ప్రతి రెండోది, నాలుగో శనివారం రోజులు సెలవులుగా పేర్కొంది. 
 
అంతేకాక, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, డిసెంబరు 26 బాక్సింగ్ డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని కేవీబీ రెడ్డి తెలిపారు. 
 
'సూపర్ సేవర్‌ కార్డు' పేరుతో ఈ ఆఫర్‌ను ప్రవేశపెడుతున్నట్లుగా ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి ప్రకటించారు. ఈ కార్డుతో సెలవుల్లో కేవలం రూ.59 చెల్లించి రోజంతా మెట్రో రైలులో ప్రయాణించవచ్చని కేవీబీ రెడ్డి వెల్లడించారు. 
 
నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని చెప్పారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లోనే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments