సీబీఎస్ఈ టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జరగనున్నాయి. టర్మ్-1 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ మేరకు 10, 12 తరగతులకు సంబంధించి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. అలాగే మే 24న ఈ పరీక్షలు ముగుస్తాయని షెడ్యూల్‌లో స్పష్టం చేసింది.
12వ తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్ 26న ప్రారంభం అవుతాయని.. ఈ పరీక్షలు జూన్ 15న పూర్తవుతాయని తెలిపింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇక ముందు ఎవరినీ కూడా పాస్ చేయబోమని స్పష్టం చేసింది.
గత ఏడాది జూలైలో ప్రకటించిన ప్యాటర్న్ ప్రకారమే టర్మ్-2 పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈసారి బోర్డు పరీక్షలు రెండు షిఫ్టులలో జరుగవని వెల్లడించింది.
జేఈఈ మెయిన్స్ వంటి ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించినట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. సుమారు 35 వేల సబ్జెక్టులు ఉండటంతో ఏ రెండు సబ్జెక్టుల పరీక్షలు ఒకే రోజు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది.