Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగార్జున ది ఘోస్ట్ భారీ షెడ్యూల్ దుబాయ్‌లో ప్రారంభం

Advertiesment
నాగార్జున  ది ఘోస్ట్ భారీ షెడ్యూల్ దుబాయ్‌లో ప్రారంభం
, గురువారం, 10 మార్చి 2022 (17:16 IST)
Nagarjuna, Sonal Chauhan,Praveen Sattaru
నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల హై బడ్జెట్  యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ఘోస్ట్` షూటింగ్ దుబాయ్‌లో తిరిగి ప్రారంభమైంది. ఇది సుదీర్ఘమైన షెడ్యూల్. సినిమాలోని ప్రముఖ తారాగణం పాల్గొనే చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్‌లో నాగార్జున సరసన కథానాయికగా నటించడానికి ఎంపికైన సోనాల్ చౌహాన్ కూడా బృందంతో జాయిన్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను కూడా టీమ్ ఆవిష్కరించింది.
 
నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చేస్తున్న సోనాల్ ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాగార్జున యాక్షన్ పాత్రలో నటిస్తున్నారు.
 
శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ముఖేష్ జి కెమెరా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, రాబిన్ సుబ్బు, నభా మాస్టర్ స్టంట్ డైరెక్టర్లు.
 
తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్
 
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
యాక్షన్: రాబిన్ సుబ్బు మరియు నభా మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల
PRO: వంశీ-శేఖర్, BA రాజు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవ‌రికీ త‌ల‌వంచ‌ని సూర్య ఏం చేశాడో తెలుసా! ఈ.టి. రివ్యూ