ఈ-వేస్ట్‌ ఛానలైజేషన్‌ పైన ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్‌- జీఐజెడ్‌ ఇండియా వర్క్‌షాప్‌

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (15:49 IST)
డ్యూయిష్‌ గెసెల్స్‌ చాఫ్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ జుసమ్మెనార్‌బీట్‌, ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌‌లు ఈ-సఫాయీ కార్యక్రమంగా గుర్తింపు పొందిన ‘ఈ-వ్యర్ధాల నిర్వహణ కోసం సృజనాత్మక వాల్యూచైన్‌ను ఏర్పాటుచేయడం’ శీర్షికన మూడు సంవత్సరాల పాటు సాగే పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం అమలు చేయడానికి చేతులు కలిపాయి.

 
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఈ-వ్యర్ధాలను  సురక్షితంగా నిర్వహించడం పట్ల పాఠశాలలు, రిటైలర్లు, బల్క్‌ వినియోగదారులు సహా పలువురు వాటాదారులకు అవగాహన కల్పించడం. దీనిలో భాగంగా ఓ వర్క్‌షాప్‌ను  నిర్వహించారు. దీనిలో ప్రధానంగా ఈపీఆర్‌(ఎక్స్‌టెండెడ్‌ ప్రొడ్యూసర్‌ రెస్పాన్సిబిలిటీ) సమ్మతి, ఈపీఆర్‌ నిబంధనలు గురించి అవగాహన కల్పించారు.
 
 
ఈ వర్క్‌షాప్‌ గురించి జీఐజెడ్‌ ఇండియా సర్క్యులర్‌ ఎకనమీ అండ్‌ క్లైమెట్‌ ఛేంజ్‌ సీనియర్‌ ఎడ్వైజర్‌ గౌతమ్‌ మెహ్రా మాట్లాడుతూ, ‘‘కేంద్ర కాలుష్యనియంత్రణ మండలి సుదీర్ఘకాలంగా నిబంధనల అమలుకు ప్రయత్నిస్తోంది. ఈపీఆర్‌ పాలసీకి కట్టుబడి ఉండటం ద్వారా  ఛానలైజేషన్‌కు సహాయపడుతుంది’’ అని అన్నారు. 

 
ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధికా కాలియా మాట్లాడుతూ ‘‘ఈపీఆర్‌ పాలసీ విజయం సాధించాలంటే వాటాదారులు తమ బాధ్యతలను గుర్తించడంతో పాటుగా మార్గదర్శకాలను అనుసరించడం చేయాలి. ఈపీఆర్‌ విధానాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నియంత్రిస్తుంది. అయితే భూగోళానికి నిలకడతో కూడిన భవిష్యత్‌ కావాలంటే మాత్రం వాటాదారులుతమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments