Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ ఆర్టీసీ బస్సులో ఐదుగురికి ఉచిత ప్రయాణం

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (08:48 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)గా ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా, ఆర్టీసీ బస్సులను ప్రయాణికులు ఆకర్షించేలా పలు రాయితీలు కల్పిస్తున్నారు. తాజాగా మరో వినూత్న ఆఫర్‌తో ముందుకు వచ్చింది. 
 
శబరిమలకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నట్టయితే ఐదుగురికి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. అయ్యప్పభక్తులకు తక్కువ చార్జీలతో బస్సును అద్దెకు ఇవ్వడంతో పాటు ప్రతి బస్సులో ఇద్దరు వంట మనుషులు, పదేళ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక అటెండర్‌ ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది. 
 
అలాగే, 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సుకు కిలోమీటరుకు రూ.48.96 వసూలు చేస్తారు. అలాగే, 40 సీట్ల డీలక్స్ బస్సుకు రూ.47.20, 48 సీట్ల డీలక్స్ బస్సుకు రూ.56.64, 49 సీట్ల ఎక్స్‌ప్రెస్ బస్సుకు రూ.52.43 చొప్పున చార్జీలను నిర్ణయించింది. ఈ బస్సులను కావాల్సిన అయ్యభక్తులు సమీపంలోని ఆర్టీసీ డిపోలు లేదా బస్ స్టేషన్లలో సంప్రదించాలని కోరింది. 
 
కాగా, ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇస్తుంది. అతేకాకుండా ఏదేని కార్యానికి ఒకే కాలనీవారు బస్సును బుక్ చేసుకుంటే వారి కాలనీకే బస్సు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటుందని ఎండీ సజ్జనార్ ప్రకటంచిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments