Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేజీ టమోటాలకు కేజీ బిర్యానీ ఎక్కడ?

Advertiesment
Chengalpattu Ambur Biryani Shop
, బుధవారం, 24 నవంబరు 2021 (07:46 IST)
దేశ వ్యాప్తంగా విస్తారంగా కురిసిన భారీ వర్షాలకు కూరగాయల ధరలు కొండెక్కాయి. ముఖ్యంగా, టమోటా ధర పెట్రోల్ ధరను దాటిపోయింది. అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుపడి పూర్తిగా తగ్గిపోయింది. అదేసమయంలో డిమాండ్ ఎక్కువ కావడంతో టమోటా కేజీ ధర రూ.130 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. దీంతో ఓ బిర్యానీ షాపు యజమానికి వినూత్న ఆలోచన వచ్చిది.
 
కేజీ టమోటాలు ఇచ్చిన వారికి కేజీ బిర్యానీ ఉచితంగా ఇస్తామని ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనను చూసిన జనాలు బిర్యానీ కోసం ఎగబడ్డారు. కేజీ టమోటాల ధర రూ.130 అయికే, కేజీ బిర్యానీ ధర రూ.200 కావడంతో బిర్యానీ కోసం ఎగబడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చెట్టినాడు వంటకాలతో పాటు ఆంబూర్ బిర్యానీకి మంచి పేరుతుంది. భోజన ప్రియులు లొట్టలేసుకుని ఆరగిస్తుంటారు. ఈ క్రమంలో చెంగల్పట్టు జిల్లా కేంద్రంలోని ఆంబూర్ బిర్యానీ దుకాణం యజమాని తమకు కావాల్సిన టమోటాలను భారీ ధర వెచ్చించి కొనలేక, ఈ తరహా ప్రకటన చేశాడు. ఒక కేజీ టమోటాలు తెచ్చి ఇచ్చిన వారికి ఒక కేజీ బిర్యానీ ఫ్రీ అంటూ ఒక బోర్డును తన దుకాణం ముందు పెట్టాడు. 
 
ఈ ప్రకటించిన తర్వాత బిర్యానీ సెంటర్‌కు భోజన ప్రియులు క్యూ కట్టారు. కిలో టమోటాలు తెచ్చి ఇచ్చి కేజీ బిర్యానీ పార్శిల్‌గా తీసుకెళ్లారు. రెండు కేజీల టమోటాలు తెచ్చే రెండు కేజీల బిర్యానీతో పాటు అర కేజీ టమోటాలను కూడా ఉచితంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట్ పరీక్షల్లో టాప్ 100లో నిలిచిన తెలుగు విద్యార్థులు