Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానంలో ఇద్దరు మహిళలు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు పెట్టి నలుగురు యువకులు...?

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (18:54 IST)
నల్గొండ హుజూర్ నగర్ మండలంలో గోవిందాపురంలో చేతబడి అనుమానంతో కొందరు యువకులను స్థానికులు చితకబాదారు. శ్రీకాంత్, రాము, రవి, వెంకటేశ్వర్లు అనే నలుగురు యువకులు గురువారం రాత్రి శ్మశానంలో క్షుద్ర పూజలు నిర్వహించారు. ఖమ్మం, ఒంగోలు ప్రాంతాలకు చెందిన భూతవైద్యులు మంత్రాలు చదవగా  యువకులు అదే మంత్రాలను పఠిస్తూ పూజలు చేశారు.
 
ఇది గమనించిన స్థానికులు వారిపై దాడికి దిగారు. దాంతో నలుగురిలో ఓ యువకుడు పారిపోయాడు. అయితే మరునాడు ఉదయం గ్రామస్తులు ఆ యువకుడిని పిలిపించి విచారించగా ఒకదానికొకటి సంబంధం లేని సమాధానాలు చెప్పసాగాడు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు యువకులను చితకబాదారు.
 
 అనుమానం చెందిన గ్రామస్తులు వారిని శ్మసానానికి తీసుకెళ్లి చూపించమన్నారు. అక్కడ సోదాలు చేయగా మట్టిలో పూడ్చిన ఇద్దరు మహిళలు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఓ చీర, జాకెట్, నిమ్మకాయలు, వెంట్రుకలు, రెండు నళ్ల కోళ్లు కనిపించాయి. దాంతో యువకులు క్షుద్ర పూజలు చేస్తున్నారని పోలీసులకు వారిని అప్పగించారు.
 
ఆ యువకులు చెప్పింది విన్న ఎస్సై వారిని మందలించి పంపేశారు. ఆ ఫోటోలు తమ కుటుంబానికి చెందినవారివేనని, తమ కుటుంబంలో కొన్నాళ్లుగా సమస్యలున్నాయని వాటికి పరిష్కారంగా పూజలు నిర్వహిస్తే తొలగిపోతుందని ఒంగోలుకు చెందిన ఓ పూజారి చెప్పడంతో ఆ పూజలు నిర్వహించామని యువకులు తెలిపారు. తాము చేతబడి చేస్తున్నామని గ్రామస్తులు మమ్మల్ని కొట్టారని యువకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments