Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుక్రవారం మహిళలకు చీరకట్టు తప్పనిసరి.. మల్లెలను శిరస్సులో ధరిస్తే..?

Advertiesment
Friday
, శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (05:00 IST)
శుక్రవారం పూట ముత్తైదువలకు ప్రత్యేకమైన రోజు. అందుకే శుక్రవారం పూజలు, ఆలయ దర్శనాలు మహిళలు కోరిన కోరికలను నెరవేరుస్తాయి. శుక్రవారం లక్ష్మీదేవి లేదా ఏదైనా అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తే.. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. 
 
శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. తలస్నానం చేసి.. పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి.. ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సుమంళి ప్రాప్తిస్తుంది. అనుకున్న కార్యాలు పూర్తైయి, శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి.
 
శుక్రవారం అమ్మవారికి తెల్లపువ్వులు సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే కుటుంబమంతా సుఖసంతోషాలతో, ప్రశాంతతతో ఉంటుందని ప్రతీతి. శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరస్సులో ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. 
 
అలాగే దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, అమ్మాయిలు సంప్రదాయ దుస్తులు ధరించాలి. చీరలు, లంగా ఓణీలు వేసుకుంటే.. సంప్రదాయత వెల్లివిరుస్తుంది. నుదుట కుంకుమ రంగు బొట్టు పెట్టుకోవాలి. 
 
ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద, విభూతిని నుదుటి బొట్టుపైన పెట్టుకోవాలి. ఇలా పువ్వులు, నుదుట కుంకుమను ధరించే సువాసినులు అంటే అమ్మలగన్న అమ్మకు మహా ప్రీతి. అందుకే మహిళలు శుక్రవారమే కాకుండా.. ప్రతీ రోజూ పువ్వులు, కుంకుమను ధరించాలని పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనుమంత సేవ.. శ్రీరాముని అవతారంలో మలయప్ప.. దర్శించుకుంటే? (video)