Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్త్రీలకు వచ్చే దురద వ్యాధులకు యూకలిప్టస్‌తో నివారణ

Advertiesment
స్త్రీలకు వచ్చే దురద వ్యాధులకు యూకలిప్టస్‌తో నివారణ
, బుధవారం, 23 సెప్టెంబరు 2020 (22:19 IST)
సరివి, యూకలిప్టస్ చెట్లను పొలాల్లో తోటల్లో చూస్తుంటాం. ఇవి వంటచెరకుగానే కాకుండా ఔషధపరంగా కూడా ఎంతో ఉపయోగపడుతాయి. యూకలిప్టస్ గురించి చూస్తే అందులో వున్న ఔషధ గుణాలు మనకు ఎంతగానే మేలు చేస్తాయి.
 
మంచి సువాసనలు కలిగిన యూకలిప్టస్ మహిళలకు సంబంధించి పలు సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి వ్యక్తిగత ప్రదేశంలో వచ్చే దురద వ్యాధులను నివారించడంలో ఎంతగానో ఉపయోగ పడుతుంది.
 
ఒళ్లునొప్పులతో బాధపడేవారు బకేట్‌ వేడి నీళ్లలో రెండు కప్పుల యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి స్నానం చేస్తే కీళ్లనొప్పు లు, శారీరక నొప్పులు తగ్గిపోయి హాయిగా నిద్ర పడుతుంది. భుజాలు, వీపు భాగాలలో యూకలిప్టస్‌ ఆయిల్‌కి కొద్దిగా విటమిన్‌ ఇని కలిపి మర్దన చేస్తే ఫలితాలుంటాయి.
 
చర్మంపై మచ్చలు ఉండే వారు వాటిపై ఈ నూనెను రాస్తే మచ్చలు పోవటంతో పాటు చర్మం కొత్త నిగారింపులు సంత రించుకుంటుంది. శనగపిండిలో కొద్దిగా యూకలిప్టస్‌ ఆయుల్‌ వేసి శరీరానికి నలుగు పెట్టుకుంటే శరీరం పొడిబారకుండా ఉండటమే కాకుండా మెత్తగా, అందంగా తయారవుతుంది.
 
యూకలిప్టస్‌ ఆయిల్‌‌తో శరీరాన్ని మర్ధన చేయించుకుంటే శరీరాన్ని చల్లబరచి, వేడిమి ఎక్కువ కాకుండా చూస్తుంది. అనేక రకాల బాక్టీరియాలను సంహరించటంలో ప్రత్యేకత చూపే ఈ ఆయిల్‌ వల్ల శరీరం తాజాదనాన్ని సంతరించుకోవటంతో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు