Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూడిదైన బస్సు.. తప్పిన ప్రమాదం.. ప్రయాణీకులు నిద్రలో వుండగా..?

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (13:40 IST)
ప్ర‌యాణికులు అందరూ నిద్రలో ఉన్న సమయంలో జనగామ ఆర్టీసీ కాలనీ హైవేలో ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు చెలరేగాయి. అయితే తృటిలో పెనుప్రమాదం తప్పింది. డ్రైవరు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించి ప్రయాణికులను కిందికి దింపి వేయడంతో.. అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. 
 
జనగామ ఆర్టీసీ కాలనీ సమీపంలో ప్రమాదవశాత్తు షాక్ సర్క్యూట్ వల్ల ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో TS 04 UD 1089 నెంబర్ గల బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధం అయ్యింది. 
 
సుమారు 26 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఛత్తీస్‌గ‌ఢ్ నుంచి జగదేవపూర్ టు హైదరాబాద్‌కు వెళ్తుండగా లింగాల ఘ‌న్‌పూర్ మండ‌లం నెల్లుట్ల గ్రామం హైవేపై ఉదయం 5:40 గంటల సమయంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. 
 
ఈ విష‌య‌మై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఉద‌యం బ‌స్సులో అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయని స‌మాచారం అందింద‌ని.. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో వ్య‌వ‌హ‌రించ‌డంతో పెనుప్ర‌మాదం త‌ప్పింద‌ని అన్నారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌డుతామ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments