Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకేసారి 200 మంది మోడళ్ల నగ్న ఫోటో షూట్‌... డెడ్‌ సీ వద్ద..?

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (13:34 IST)
ఒకేసారి 200 మంది మోడళ్లు నగ్నంగా ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. ఈ ఫోట్‌ షూట్‌ ఇజ్రాయిల్‌లోని డెడ్‌ సీ వద్ద చేశారు. ప్రముఖ ఆర్టిస్ట్ స్పెన్సర్‌ టునిక్‌ ఈ ఫొటో షూట్‌ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళ్తే.. ఇజ్రాయిల్‌ దేశంలో నీటి సమస్య రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా డెడ్‌ సీలోని ఏడారి ప్రాంతంలోని భూగర్భంలో నీరు తరిగిపోతోంది. అక్కడి పౌరులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నీటిపై అవగాహన కల్పించేందుకు మోడళ్లు నగ్నంగా ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్‌ స్పెన్సర్‌ ఆదేశాలకు అనుగుణంగా మోడళ్లు అందరూ శరీరానికి తెల్లని రంగు పూసుకొని ఫొటోలు దిగారు.
 
ఈ కార్యక్రమాన్ని ఇజ్రాయిల్‌ టూరిజం వింగ్‌ చేపట్టింది. గతంలో 1000 మంది మోడళ్లతో నగ్నంగా డెడ్‌ సీ వద్ద ఫొటో షూట్‌ చేశాడు ట్యునిక్. ప్రతి సంవత్సరం డెడ్‌ సీలోని నీరు ఓ మీటరు మేర ఎండిపోతున్నది.
 
 మైనింగ్‌ సమస్యతో పాటు ఇజ్రాయిల్‌, జోర్డాన్‌లు వ్యవసాయం కోసం ఎగువ ప్రాంతాల్లో నీటిని మళ్లీస్తుండడంతో ప్రతి ఏటా డెడ్‌సీలో నీరు తరిగిపోతూ వస్తోంది. దీనికి స్థానిక వాతావరణ సమస్యలు కూడా తోడయ్యాయి. 
 
అయితే మోడళ్లకు తెల్లని రంగు వేయడం వెనుక గల కారణాన్ని ఫొటో గ్రాఫర్‌ ట్యునిక్‌ తెలిపాడు. ఓ బైబిల్‌ కథ ప్రకారం.. ఓ వ్యక్తి భార్య ఉప్పు స్తంభంగా మారిపోతుందని, దానిని దృష్టిలో పెట్టుకొనే మోడళ్లకు తెలుపు రంగు వేశామని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం