Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజురాబాద్‌ స్థానంలో ఈటల జమున పోటీ

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (14:06 IST)
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ రాజీనామాతో ఖాళీ అయిన‌ హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గాల్సి ఉన్న నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీల‌న్నీ త‌మ అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌రత్తు చేస్తోన్న విష‌యం తెలిసిందే. 
 
ఈ నియోజక వ‌ర్గం నుంచి ఈట‌ల రాజేంద‌ర్ పోటీకి దిగ‌కుండా ఆయ‌న భార్య జ‌మున‌ను బ‌రిలోకి దింపుతార‌ని కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ప్ర‌చారానికి బ‌లం చేకూర్చేలా జ‌మున ప‌లు వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తి రేపుతోంది.
 
హుజురాబాద్ పోటీలో తాను కూడా ఉన్నట్లు జ‌మున వ్యాఖ్యానించారు. అయితే, ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. త‌న భ‌ర్త‌ పోటీ చేసినా, తాను పోటీ చేసినా ఒక్కటేనని చెప్పారు. 
 
తెలంగాణ ఉద్యమం స‌మ‌యంలోనూ తాను తన భర్త ఈటలను వెనకుండి నడిపించానని ఆమె తెలిపారు. అలాగే, ప్రతి ఎన్నికల్లో ఈటల ముందుండి ప్రచారం చేశానని అన్నారు. త‌మ‌ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లం పోటీ చేస్తామ‌ని చెప్పారు. 
 
ఉప ఎన్నిక నేప‌థ్యంలో హుజూరాబాద్‌లోని పలు వార్డుల్లో ఆమె ప్ర‌చారం చేస్తున్నారు. రేప‌టి నుంచి ఈటల కూడా పాదయాత్ర చేయ‌నున్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments